18 April, 2026 | 1:48 AM

ప్రతి పాఠశాలలో విద్యార్థుల నమోదు తప్పనిసరి

31-10-2025 01:55 AM

అశ్వాపురం, అక్టోబర్ ౩౦,(విజయక్రాంతి): అశ్వాపురం మండల పరిధిలోప్రభుత్వ పాఠశాలలో యూ-డైస్ దిశా నిర్దేశ కార్యక్రమ సమావేశం మండల విద్యాశాఖ అధికారి వీరాస్వామి అ ధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రతి పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థుల సంఖ్య ఖచ్చితంగా నమోదు అయ్యి ఉండాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి.

గైర్హాజరు అనే పదం లేకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలి అని పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాల ఆవరణలో కరివేపాకు, మునగ, చింత, ఉసిరి, పనస, వెలగ, మారేడు, నేరేడు, పూల మొ క్కలు మరియు ఔషధ మొక్కలు తప్పనిసరిగా నాటాలని సూచించారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

ఉ పాధ్యాయుల బోధనా సామర్థ్యం, విద్యార్థుల విషయ పరిజ్ఞానంపై జిల్లా స్థాయి బృందాలు న వంబర్ మొదటి వారంలో పరిశీలన, ధ్రువీకరణ నిర్వహిస్తాయి అని తెలిపారు. తరువాత యూ-డైస్ డేటా ఎంట్రీ, పాఠశాలల పురోగతి, విద్యార్థుల ప్రగతి వంటి అంశాలపై ఉపాధ్యాయులతో సవివరంగా చర్చించారు. ఈ సమావేశంలో మల్లెలమడుగు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోపి వరప్రసాద్, సీతారామపురం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మేరీ శ్రీ, అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులుపాల్గొన్నారు.