తుఫాన్ సహాయక చర్యలలో ఆపద మిత్రలు కీలకపాత్ర
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): మొం థా తుఫాన్ సహాయక చర్యలలో ఆపద మిత్రలు కీలకపా త్ర పోషించారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. విపత్కర సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సహా యక చర్యలలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రతి మండలానికి కొంత మంది ఆపద మిత్రలను ఎంపిక చేసి వారికి అ వసరమైన శిక్షణ గతంలో అందించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 300 మంది యువతకు ఆపదమిత్ర లుగా ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చామన్నారు.
ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతంలో గల లోతట్టు ప్రాంతాలైన సారధి నగర్, బొక్కల గడ్డ, అగ్రహారం కాలనీ, వెంకటేశ్వర నగర్, పద్మావతి కాలనీలలో మొంథా తుఫాన్ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఆపదమిత్రలు బుధ, గురువారాల్లో మున్నేరు లోతట్టు ప్రాంతాల ప్రజలను చైతన్య పరుస్తూ పునరావాస కేంద్రాలకు తరలించుటలో పూర్తిగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు.ప్రజలకు తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ, జిల్లా అధికారులతో సహాయక చర్యలలో చాలా చురుగ్గా పాల్గొన్నట్లు జిల్లా కలెక్టర్‌అన్నారు






