17 April, 2026 | 9:35 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

18-11-2025 12:00 AM

ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు

నిజామాబాద్, నవంబర్ 17 (విజయ క్రాంతి):  గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారి వేతనాలను పెంచి వారిని ఉద్యోగాల్లో పర్మినెంట్ చేయాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి ఎంపీడీవో కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కార్మికుల సమస్యల పరిష్కరించాలని, పీఎఫ్ ఈఎస్‌ఐ చట్టాల అమలు చేయాలని తన విజ్ఞాపన పత్రంలో ఆయన కోరారు,

కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆయన కోరారు. ప్రమాద బీమా 30 లక్షల కట్టాలని, జీవో నెంబర్ 51 మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, ఆన్లైన్లో ఎక్కనీ వారి పేర్లను ఎంట్రీ చేయాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దేవన్న గ్రామపంచాయతీ నాయకులు షాపూర్ పోశెట్టి, భాస్కర్, ముత్యం ,లింగన్న రసూల్, సావిత్రి చిన్నయ్య, ఆశీర్వాదం, రషీద్ పాల్గొన్నారూ.