calender_icon.png 18 November, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి శనివారం పోలీస్ కమిషనర్‌తో ఫోన్ ఇన్

18-11-2025 12:00:00 AM

సిద్దిపేట క్రైం, నవంబర్ 17 : ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి పోలీస్ కమిషనర్ ఎస్‌ఎం విజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ‘పోలీస్ కమిషనర్ తో ఫోన్ ఇన్‘ కార్యక్రమం చేపట్టారు.

ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12గంటల వరకు 8712667100, 8712667306, 8712667371 నంబర్లకు ఫోన్ చేసి, ప్రజలు తమ పరిసరాలలో గమనించిన నేర కార్యకలాపాలు, సమస్యలను వివరించవచ్చు. ప్రతి ఫిర్యాదును గోప్యంగా ఉంచి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. నేర రహిత సమాజం కోసం పౌరులందరూ సహకరించాలని కోరారు.