17-11-2025 11:52:14 PM
మల్కాజిగిరి (విజయక్రాంతి): బాక్స్ డ్రెయిన్ పనులపై స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం క్యాంప్ కార్యాలయంలో జిహెచ్‌ఎంసి, ఎస్.ఎన్.డి.పీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సేఫల్‌గూడ చెరువు, సూర్యనగర్ కాలనీ మధ్య ఉన్న 25 ఏళ్ల పాత బాక్స్ డ్రెయిన్ పూర్తిగా దెబ్బతిన్నందున తక్షణ సర్వే చేసి కొత్త డ్రెయిన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే బండ చెరువు ఓవర్ వల్ల షిరిడినగర్, ఎస్.ఎన్.డి.పీ కాలనీలలో ఏర్పడుతున్న ముంపు సమస్యలపై శాశ్వత పరిష్కార ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించి అవసరమైన పనులు ప్రాధాన్యంగా చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.