03-12-2025 07:25:05 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో 26 గ్రామపంచాయతీలు సర్పంచ్ పదవికి, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
మండలాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి..
తాండూర్ మండలంలో..
కరణ్ కోర్ట్, రాంపూర్ తండా, వీరారెడ్డిపల్లి, బిజ్వార్, చిట్టి ఘనపూర్
యాలాల మండలంలో..
లక్ష్మీ నారాయణపూర్, గంగాసాగర్, దేవుల తాండ, సంఘం కుర్దు, కిష్టాపూర్ ,జక్కయ్యపల్లి సంగాయి గుట్ట తాండ, పేరుకంపల్లి తండా, బండమీదిపల్లి, రేలగడ్డ తాండ, సంగాయిపల్లి తండా
పెద్దేముల్ మండలంలో..
రుద్రారం, చైతన్య నగర్, దుర్గాపూర్, సిద్దన్నమడుగు తాండ.
బషీరాబాద్ మండలంలో...
మంతన్ గౌడ్, బాబు నాయక్ తండ, అనికా నాయక్ తండ, బద్లాపూర్
కోట్పల్లి మండలంలో...
లింగంపల్లి, బుగ్గపూర్ గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు మెంబర్లు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు.