calender_icon.png 3 December, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శివపార్వతుల కల్యాణం

03-12-2025 07:21:38 PM

సిద్దిపేట: సిద్దిపేట లాల్ కమాన్ వైశ్య ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంతోషిమాత ఆలయం నుంచి శివపార్వతుల ఉత్సవమూర్తులను సుభాష్ రోడ్, మార్కెట్ చౌరస్తా, లాల్ కమాన్ మీదుగా సుందర సత్సంగం వరకు ఊరేగించారు. మహిళలు కోలాటాలతో అడుగడుగునా స్వాగతం పలికారు. భక్తులు పెద్దసంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం సుందర సత్సంగంలో ఏర్పాటుచేసిన వేదికపై వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. శివనామస్మరణతో కల్యాణ మండపం మారుమోగింది. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.