27 July, 2026 | 12:54 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

రుద్రంగిలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు

28-05-2026 04:05 PM

రుద్రంగి మే 28 (విజయక్రాంతి): బక్రీద్ పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ముస్లిం సోదరులు ఉదయాన్నే మసీదు దగ్గర అందరూ కలుసుకొని ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు.అనంతరం ఒకరికొకరు ఆలాయి బలాయ్ తీసుకొని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా CI రవీందర్,SI మోతీరామ్ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు.

బక్రీద్ పండుగ శాంతిభద్రతల నడుమ సంతోషంగా జరుపుకోవాడం జరిగిందని తెలిపారు.అనంతరం మైనార్టీ మండల అధ్యక్షుడు మహ్మద్ సదుల్లా మాట్లాడుతూ.బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గా దగ్గర బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్టు తెలిపారు.త్యాగం భక్తి విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.ప్రతి సంవత్సరం రంజాన్ పండగ ముగిసిన తర్వాత బక్రీద్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.ఆ అల్లా దీవెనెలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు.