ఘనంగా మేయర్ జన్మదిన వేడుకలు
22-06-2024 12:22 AM
- విద్యార్థులకు బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేయర్ ఎన్‌బీటీ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలంటే విద్యార్థి దశ నుంచే కష్టపడాలని సూచించారు.






