అట్టహాసంగా పుస్తకావిష్కరణ
నిర్మల్, మార్చి ౧౫ (విజయక్రాంతి): ప్ర ముఖ కవి అంబటి నారాయణ రచించిన 18 వ ‘పుస్తకము పుడమిని ముద్దాడిన పొద్దు’ పుస్తకావిష్కరణ ఆదివారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సం ఘం సాంస్కృతిక హాల్లో డా కావేరి ఫౌండేష న్, నిర్మలభారతి సాహిత్య సాంస్కృతిక కళా సామాజిక సేవా క్షేత్రం ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది ముఖ్య అతిథులుగా- ప్రముఖ కవి గుడిపాటి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
జనజ్వా ల, మరికంటి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. తెరవే ప్రధాన కార్యదర్శి డా బి.వెంకట్ వ్యా ఖ్యానం చేశారు. డా అప్పాలచక్రధారి, తెరవే జిల్లా అధ్యక్షులు నేరెళ్ళ హన్మంతు, కవి యాత్ర చైర్మన్ నివేదిత, యం.సి .లింగన్న, డా దామెర రాములు, పత్తి శివప్రసాద్, పోలీస్ భీమేశ్, బొందిడి పురుషోత్తమరావు పాల్గొన్నారు.




