16 March, 2026 | 3:54 PM

చిలకనగర్‌లో కానిస్టేబుల్ దారుణ హత్య

16-03-2026 12:19 AM

ఉప్పల్, మార్చి 15 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిలకనగర్‌లో కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది. దుండగులు, అందరూ చూస్తుండగానే వేటకొడవళ్ల తో వేటాడి కిరాతకంగా చంపారు. చిలకనగర్ ప్రాంతానికి చెందిన సుధీర్ (32) కాని స్టేబుల్ సిఎస్ డబ్ల్యూ హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. సుధీర్‌కు గత కొంతకాలంగా తన స్నేహితులతో వివాదాలు ఉన్నాయి.

అయితే ఆదివారం నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా సుధీర్ పై దాడి చేశారు. సుధీర్ ఒంటరిగా ఉన్న సమయం చూసిన అతని స్నేహితులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడం తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. పాత కక్షల లేదా ఆర్థిక లావాదేవీల అనే కోణంలో  పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు.నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులు పట్టుకుంటామని  ఏసీపీ వెంకట్ రెడ్డి  పేర్కొన్నారు.