12 June, 2026 | 1:24 AM

వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చన

12-06-2026 12:00 AM

గుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య రాబడి రూ.28లక్షలపైనే..

యాదగిరిగుట్ట, జూన్ 11 (విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చక స్వాములు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. స్వామివారి నిత్యరాబడి  రూ.28,65,591 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదగిరిగుట్టలో 57 ఉద్యోగులకు గాను నిర్వహించిన రాత పరీక్షలకు ౨౨౫ మంది హాజరయ్యారని ఆలయ ఈవో వివరించారు.