31 July, 2026 | 8:24 PM

Breaking News

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •  

పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ శంకుస్థాపన

12-06-2026 12:00 AM

కరీంనగర్, జూన్ 11 (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్, బహదూర్ఖాన్ పేట్ లో సుడా నిధులతో పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముగ్దుంపూర్ మెయిన్ రోడ్డు ఆనుకొని 5 లక్షలతో డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహదూర్ఖాన్ పేట్ లో 10 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజల కోరిక మేరకు అవసరమైన చోట అభివృద్ధికి నిరంతరంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు.

ఈ కార్యక్రమాలలో శ్రీగిరి రంగారావు, బహద్దూర్ఖాన్ పేట్ సర్పంచ్ గుర్రం తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్ తప్పట్ల అంజయ్య, దుబ్బపల్లి సర్పంచ్ మోతే ప్రశాంత్ రెడ్డి, చామనపల్లి సర్పంచ్ బోగొండ అయిలయ్య, చర్లబుత్కూర్ సర్పంచ్ కూర నరేష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేందర్, మొగ్దుంపూర్ గ్రామ వార్డ్ మెంబర్ మల్లారెడ్డి, సిరిగిరి రంగారావు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.