4 August, 2026 | 1:52 AM

అల్ఫోర్స్‌లో ఘనంగా హరితహారం

04-08-2026 12:00 AM

కొత్తపల్లి, ఆగస్టు 3 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో కళాశాలలో సోమవారం ఎన్సిసి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా ని ర్వహించారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అ ధినేత, విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై మా ట్లాడుతూమొక్కలు నాటడం మాత్రమే కా దు వాటిని పెంచి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దడం కూడా ప్రతి క్యాడట్ల ప్రాథమిక బాధ్యత అ ని, మొ క్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ఎన్సిసి క్యాడెట్లు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఎఎన్‌ఓ సందీప్ సింగ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.