పంపుహౌస్ పునరుద్ధరణ చేపట్టాలి: బీజేపీ
04-08-2026 12:00 AM
చిన్నంబావి, ఆగస్టు 3: మండలంలోని చిన్నమారూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపుహౌస్ను సోమవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్లు చోరీకి గురై నెలలు గడుస్తున్నా పంపుహౌస్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులకు సాగునీరు అందడం లేదని విమర్శించారు.
కృష్ణా నదిలో తగినంత నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల చేపట్టడం లేదని ఆరోపించిన నాయకులు, వెంటనే పంపుహౌస్ను పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.






