ఘనంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం
ఉప్పల శ్రీనివాస్‌గుప్తా దంపతుల హాజరు
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ్ ప్రెసిడెంట్ మంజు ల ఆధ్వర్యంలో కొత్తపేటలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ మహోత్సవానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా దంపతులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్నకు మ హిళా విభాగ్ నాయకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో విష్ణు సహస్ర నామ పారాయణం, మణిద్వీప వర్ణన, వాసవీమాత గోష్టి సేవ వంటి పలు ఆధ్యాత్మిక కార్య క్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నా యి. లోక క్షేమం కోసం ఈ కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. భారతీయ సంస్కృ తి, సనాతన ధర్మ పరిరక్షణలో మహిళల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. బ్రాహ్మ ణులకు వాయినాలు అందజేశారు.






