13 June, 2026 | 2:16 AM

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోపాజి

13-06-2026 12:00 AM

సంగారెడ్డి, జూన్ 12 : ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన తోపాజి అనంత కిషన్ హైదరాబాద్లోని చంపాపేటలో ఉన్న సామ సరస్వతి గార్డెన్ లో శనివారం ప్రమాణస్వీకారం నిర్వహించారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ సమక్షంలో తోపాజి అనంత కిషన్ ప్రమాణ స్వీకారం చేశారు.

అనంత కిషన్ మాట్లాడుతూ.. తనకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణకు అభినందనలు తెలిపారు.