28 July, 2026 | 1:51 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ఖమ్మం ఘటనపై నిందితుడికి కఠిన శిక్ష విధించాలి

13-06-2026 12:00 AM

సిద్దిపేట క్రైం, జూన్ 12 : ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశం లో తెలంగాణ గో రక్షక్ దళ్ రాష్ట్ర సభ్యుడు గ్యాదరి రాజారాం మాట్లాడుతూ, ఖమ్మం పట్టణంలో జరిగిన దారుణ ఘటనలో బాధి త బాలికకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.

నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని కోరారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. సమావేశంలో సిద్దిపేట జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ బైరి మురళి, బోనాల శ్రీనివాస్, పొదిల శ్రీనివాస్, అజయ్, చిరంజీవి పాల్గొన్నారు.