15 May, 2026 | 3:50 AM

పూర్వ విద్యార్థులకు ఘనంగా సన్మానం

15-05-2026 02:18 AM

జడ్చర్ల, మే 14: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా వారోత్సవాలలో భాగంగా స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. సుకన్య, కన్వీనర్ డాక్టర్ బి.సదాశివయ్య ఆధ్వర్యంలో మంది పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎంతోమంది మహనీయులు ఈ కళాశాలలో చదివి సమాజ హితం కోసం పనిచేస్తూ, కళాశాల అభ్యున్నతికి శ్రామిస్తున్నారనడంలో అతశ యోక్తిలేదన్నారు.

ఈ సమావేశం లో కళాశాల పూర్వ విద్యార్థుల కన్వీనర్ డాక్టర్ సదాశివయ్య బాద్మి శివకుమార్, మండల విద్యాధికారిని మంజులాదేవి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్, గోనెల రవిశంకర్, జనార్దన్ రెడ్డి, రాజేందర్ గౌడ్, అనంత రాములు, ఎలకంటి భాస్కర్, రత్న శేఖర్, స్థానిక మాజీ కౌన్సిలర్ దేశవాళి సతీష్ కుమార్, ఇదే కళాశాలలో చదివి ఇక్కడే పనిచేస్తున్న డాక్టర్ వి పుష్పలత, డాక్టర్ కళ్యాణి నరసింహారావు, వెంకట్ రెడ్డి, జగన్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి నర్మదా,డాక్టర్ బి శ్రీనివాసులు, రుకియా భాను ఆధ్యాపకులు రాఘవేంద్ర రెడ్డి, నరసింహులు, వెంకటయ్య, సతీష్ రెడ్డి, ఆంజనేయులు, జయలీల, లతా రజని, నందకిషోర్ పాల్గొన్నారు.