8 June, 2026 | 1:38 PM

మీ సేవలు మరువలేనివి

08-06-2026 12:36 PM

- బూరుగుపల్లి బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘన సన్మానం

గజ్వేల్, ( విజయ క్రాంతి): విధి నిర్వహణలో భాగంగా బదిలీపై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శి ఆర్. నాగరాజు, వ్యవసాయ విస్తరణ అధికారి జి. నర్సింలును గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో గ్రామాభివృద్ధికి వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తమ విధుల పట్ల అంకితభావంతో పనిచేసిన అధికారులు  గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గ్రామ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీహెచ్. రాజు, ఉప సర్పంచ్ కిషోర్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్, వార్డు సభ్యులు, గ్రామ స్థాయి సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.