8 June, 2026 | 1:34 PM

మంథనిలో ప్రశాంతంగా గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు

08-06-2026 12:33 PM

మంథని, జూన్ 8 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథనిలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నేడు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంఘానికి, మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మంథని, గంగాపూరి, సూరాయ్యపల్లె గ్రామాలకు చెందిన సుమారు 150 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.