భద్రకాళి ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
వరంగల్ (మహబూబాబాద్) జూన్ 17 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ధ్వజస్తంభప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 8:36 గంటలకు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి చేతుల మీదుగా జరుపడంతో సుసంపన్నమైంది.
ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఇరిగేషన్ ఎస్.ఈ హరి వెంకట రామ ప్రసాద్, ప్రముఖ వితరణశీలి తొట్రెడ్డి హృదయ్ కుమార్ రెడ్డి అర్చన పంపతులు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ కృష్ణ ప్రసాద్, దాతలు జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయ్కుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీష్ కుమార్ తో పాటు దేవాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, శ్రీమతి మోతుకూరి మయూరి రామేశ్వర్ రావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, అనంతుల శ్రీనివాస్, సిరివోలు శ్రీధర్ రావు, భక్తులు, దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు.
ప్రతిష్ఠలో పాల్గొన్న భక్తులందరికీ భద్రకాళీ భక్త సేవాసమితి కన్వీనర్ అయితా గోపీనాథ్ నేతృత్వంలో ఆలయానికి విచ్చేసిన భక్తులంరికీ అన్నప్రసాద వితరణ జరిగినది. ఈ కార్యక్రమం భద్రకాళి శేషు నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థుల సమన్వయంతో వర్ధమాన ఆగమ శాస్త్ర పండితులు శ్రీ గుమడవెల్లి గణేశ్ ఆత్రేయ శర్మ కన్నుల పండుగగా ఉత్సవాన్ని నిర్వహించారు..ప్రతిష్ఠ అనంతరం ఆకాశాన్ని తాకుతోందా అన్నట్టుగా కనబడుతున్న ధ్వజస్తంభాన్ని దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. ఆలయం అంతా జై భద్రకాళి మాత నినాదాలతో భక్తిపారవశ్యంతో మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఈవో రామల సునీత దగ్గరుండి పర్యవేక్షించారు.
అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ప్రముఖ సినీ నటుడు కొనిదెల పవన్ కళ్యాణ్ బుధవారం ఆలయానికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అమ్మవారికి చీర, ఓడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు.






