భద్రకాళి ఆలయంలో ఘనంగా పల్లకీ సేవ
25-04-2026 02:05 AM
వరంగల్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు అరవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన తదుపరి చతు: స్థానార్చన జరిపి వల్లకీ సేవ, సాయంకాలం శేషవాహన సేవ పై అమ్మవారికి ఊరేగింపు జరిపారు. భద్రకాళీ దేవస్థానం ప్రధాన రహదారి కూడలిలోని విద్యారణ్యుల విగ్రహానికి పుష్పమాల సమర్పించి విద్యారణ్య జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.






