1 September, 2026 | 10:28 AM

కొవ్వొత్తులతో శిరీషకు ఘన నివాళి

01-09-2026 09:49 AM

గుండాల, (విజయక్రాంతి): ములకలపల్లి మండలం చౌటిగూడెంకు చెందిన ఆదివాసీ యువతి ఊకే శిరీష (21) హైదరాబాద్‌లో అనుమానాస్పద మృతిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో మానవహారం చేపట్టి శిరీషకు నివాళులర్పించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.