1 September, 2026 | 10:19 AM

నేత్రదానం చేయండి.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపండి

01-09-2026 09:46 AM

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 41వ నేత్రదాన పక్షోత్సవాలు

మరణించిన 6 నుంచి 8 గంటల్లోపు నేత్రదానం చేయాలి

ఒకరి నేత్రదానంతో ఇద్దరికి చూపు లభించే అవకాశం

ఖమ్మం, ఆగస్టు -31విజయక్రాంతి: ఖమ్మంలో 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఒకరి నేత్రదానంతో ఇద్దరికి చూపు లభించే అవకాశం ఉందని తెలిపారు. మరణించిన 6 నుంచి 8 గంటల్లోపు నేత్రాలను సేకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నేత్రదానంపై వివరాలకు 9397191919, 9247571995 నంబర్లను సంప్రదించాలని సూచించారు.