ఖమ్మం పోలీసులకు సేవా పతకాలు
01-09-2026 | 09:42am
ఖమ్మం, విజయక్రాంతి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర పోలీసు సేవా పతకాల్లో ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 15 మంది సిబ్బందికి పతకాలు లభించాయి. ఉత్తమ సేవ పతకాలను అడిషనల్ డీసీపీ బి. రామానుజం, హెడ్ కానిస్టేబుళ్లు వి. బిక్షపతి, కె. సూర్యప్రకాష్ రెడ్డి అందుకున్నారు. మిగిలిన సిబ్బందికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పతకాలు అందజేసి అభినందించారు.