బుదేరా కాలేజీ ప్రిన్సిపాల్ సస్పెండ్.. నిర్లక్ష్యంపై కలెక్టర్ యాక్షన్..!
01-09-2026 10:16 AM
మునిపల్లి, ఆగస్టు 31: మునిపల్లి మండలం బుదేరా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి. శైలజ సస్పెండ్ అయ్యారు. కళాశాల నిర్వహణలో లోపాలు, పరిపాలనా నిర్లక్ష్యం, విద్యార్థినుల పట్ల తగిన విధంగా వ్యవహరించకపోవడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ చర్యలు తీసుకున్నారు. కళాశాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.






