19-02-2026 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఎల్లమ్మ కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది, గుండ్ల పోచంపల్లి చుట్టూ పక్కల మహిళలు పెద్దఎత్తున బోనాలు సమర్పించారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరి ఉండాలని నిర్వాహకులు మొక్కుకున్నారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ పెద్దలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ పెద్దలు మాట్లాడుతూ ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు, ఇక్కడ ఎవరు ఏ కోరిక కోరుకున్న తప్పకుండా నెరవేరుతుందని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ప్రతి సంవత్సరం తప్పకుండా ఇక్కడికి వస్తారని అన్నారు. అలాగే సిటీ నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి వారి వారి కోరికలు నెరవేరినా తర్వాత దేవుడికి కానుక రూపంలో మొక్కులు చెల్లించుకుంటారని కూడా ఆలయ పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.