calender_icon.png 19 February, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు ఎంపిక

19-02-2026 12:00:00 AM

సుల్తానాబాద్ , ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోకల్ టు గ్లోబల్ అనే నినాదంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.టేబుల్ టెన్నిస్ బాలికల విభాగంలో ఈ వర్షిత, సిహెచ్ ఖుషి,కే మనస్విని, ఎస్ సాత్విక, బాలుర విభాగంలో బి మణికంఠ, ఎండి అష్రఫ్, ఎస్ సృజన్, ఏం సహర్ష్ ఎంపిక కాగా వాలీబాల్ బాలుర వి భాగంలో ఎం అక్షిత్ కుమార్, బాలికల విభాగంలో డి ప్రియదర్శిని, కే లాస్య, ఫుట్బాల్ బాలుర విభాగంలో హార్దిక్ ఎంపికయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ మా టేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు బుధవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, శివ, సతీష్ పాల్గొన్నారు.