మంత్రి సీతక్కకు ఘన స్వాగతం
ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో సన్మానం
అశ్వాపురం, మే 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్కకు ఆదివారం రాత్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఘన స్వాగతం పలికారు. గుగులోతు వీరస్వామివిజయలక్ష్మి దంపతుల కనిష్ట పుత్రుడు, సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్‌శ్రావణిప్రియ నూతన దంపతులను ఆశీర్వదించేందుకు విచ్చేసిన మంత్రి సీతక్కను నాయకులు, కార్యకర్తల సమక్షంలో శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి, వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి సీతక్కతో ఫోటోలు దిగుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్, గొల్లపల్లి నరేష్, కోల శ్రీకాంత్, మాదినేని రాంబాబు, సోడే వెంకటేశ్వర్లు, వేముల విజయ్, సోడె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






