5 May, 2026 | 2:55 AM

రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

05-05-2026 01:17 AM

పంటలు పాడైపోతున్నా కొనుగోలు లేవు, 

తిరుమలాయపాలెంలో రైతుల రోడ్డెక్కిన ఆగ్రహం

తిరుమలాయపాలెం 4 మే (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం వద్ద వరంగల్‌ ఖమ్మం హైవేపై రైతులు భారీగా ధర్నాకు దిగుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మొక్కజొన్న, వరి పంటలు సిద్ధంగా ఉన్నా కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాలు పడే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో పంటలు పాడైపోయే ప్రమాదం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. ఈ సందర్భంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్త్స్ర కూచిపూడి జగదీష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి మాట్లాడినా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు తక్షణమే మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రారంభించాలని లేదంటే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరించారు.