7 August, 2026 | 9:53 AM

మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం

15-06-2026 01:41 PM

బోథ్, జూన్ 15(విజయక్రాంతి): పాఠశాలను ప్రారంభమైన మొదటి రోజున అన్ని గ్రామాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఘనంగా స్వాగతించారు. పాఠశాలలో ని ద్వారాల వద్ద బెలూన్స్ తో పాటు వివిధ రకాల జెండాలను ఏర్పాటు చేసి బ్యాండ్ మేళాలతో సుస్వాగతం జరిగింది. మండలంలోని కౌట (బి )గ్రామంలో. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరవ తరగతిలో చేరిన విద్యార్థులను ఘనంగా స్వాగతించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల సెంటిమెంట్ విద్యార్థుల గైరాజర్

పాఠశాల ప్రారంభం రోజున అమావాస్య రావడంతో పెద్ద మొత్తంలో విద్యార్థులను పాఠశాలకు తల్లిదండ్రులకు పంపించలేకపోయారు. పాఠశాల మొదటి రోజున అమావాస్య అడ్డు వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. కాగా మంగళవారం రోజున సైతం సెంటిమెంటు ప్రకారం ఆడపిల్లలను బయటకు పంపించరు. దీంతో మంగళవారం సహితం ఆడపిల్లలు పాఠశాలకు గైరాజర్ అయ్యే అవకాశాలున్నాయి.