28 March, 2026 | 11:07 PM

తాతా.. నీకు టాటా

04-05-2024 01:20 AM

బీజేపీ వైఫల్యాలపై టీ కాంగ్రెస్ వీడియో 

హైదరాబాద్, మే3 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వానికి వ్యతిరేకంగా టీ కాంగ్రెస్ వినూత్నమైన కార్యక్రమాలు చేస్తోం ది. రెండ్రోజుల క్రితం బీజేపీ తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద  గుడ్డు’ మాత్రమే అనే నిరసన కార్యక్రమా న్ని చేపట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు తాతా.. నీకు టాటా.. అంటూ సరికొత్త వీడియోను శుక్రవారం విడుద ల చేసింది. ‘పదేళ్లు తెలంగాణకు ద్రోహం చేసింది చాలు.. తాతా నీకు టాటా’ అంటూ రూపొందించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర విభజన చట్టాల అమలులో మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నిర్లక్ష్యం, 2020 లో హైదరాబాద్ వరదల సమయంలో కేంద్రం ఎలాంటి సాయం అందించకపోవడం, ఐటీఐఆర్ లాంటి అనేక అంశాల్లో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని ఈ వీడియోలో పేర్కొంది.