29 March, 2026 | 12:05 AM

బస్సు ఢీకొని యువకుడు మృతి

28-03-2026 10:28 PM

ఆమనగల్లు,(విజయక్రాంతి): బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన శనివారం ఆమనగల్లులో చోటుచేసుకుంది. ఆమనగల్లు పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కాచిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో చిన్న కేశవ కాలనీకి చెందిన పల్లపు చరణ్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి  కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.