6 June, 2026 | 6:44 AM

పశువులకు ఉచిత టీకాలు: రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సమాచారం!

28-03-2026 10:44 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల పరిధిలోని తాళ్ల వెళ్ళాంల గ్రామంలో శనివారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. పశుగ్రాస రక్షణ మరియు పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పశువులకు టీకాలు వేశారు. ఒకే రోజు మొత్తం 57 గేదెలు, 47 ఆవులకు పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు.

హైదరాబాద్‌కు సంబంధించిన తాజా వార్తలు ఇక్కడ చదవండి”

ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ అమరేందర్ మాట్లాడుతూ పశువులకు సోకే ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని నివారించేందుకు ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు. పశువుల ఆరోగ్యం పై రైతుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ఉప సర్పంచ్ పామునుగుల్ల సునీత బుచ్చి రాములు, పాల సంఘం చైర్మన్ బత్తుల ప్రవీణ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:

గాలికుంటు వ్యాధి ముప్పు: పశు రైతులు తప్పక టీకాలు వేయించాలి!

వర్షాకాలానికి ముందు జాగ్రత్త: పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి!

గాలికుంటు వ్యాధి ముప్పు: 7వ విడత టీకాల శిబిరాన్ని రైతులు తప్పక వినియోగించుకోండి!