28 March, 2026 | 9:23 PM

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

04-05-2024 01:21 AM

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి) : వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి నేతృత్వంలో శుక్రవారం గాంధీభవన్‌కు వచ్చిన నాయకులు, కార్యకర్తలకు చేరికల కమిటీ సభ్యులు కోదండరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో వందలాది మంది చేరుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఐదు గ్యారెంటీలు ఇప్పటికే అమలవుతున్నాయని గుర్తు చేశారు.