5 July, 2026 | 7:01 PM

శాంతిఖని గనిలో ఉద్యోగికి ఘనంగా సన్మానం

31-08-2024 10:22 AM

బెల్లంపల్లి(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఏవునూరి లక్ష్మయ్య (ట్రామర్)ను  శనివారం గని ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గని యాక్టింగ్ మేనేజర్  పి. రాజు,  బీఎం ఇంఛార్జి ముస్తఫా, ఇంజనీర్ రాంసాగర్, సీనియర్ అండర్ మేనేజర్ నాగవర్ధన్, జూనియర్ సర్వే అధికారి యు.రమేష్ సంక్షేమ అధికారి సత్యనారాయణ, ఏఐటీయూసి పిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్ ఇతర యూనియన్ నాయకులు, గని అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.