వెస్టిండీస్ ఘన విజయం
దక్షిణాఫ్రికాతో తొలి టీ20
ట్రినిడాడ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. శనివారం ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (42 బంతుల్లో 76) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డె మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సఫారీ బౌలర్లలో బార్ట్‌మన్ రెండు వికెట్లు తీశాడు. పూరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది అవార్డు’ దక్కింది.




