కాంస్య పోరుకు జస్పూరన్
25-08-2024 12:30 AM
అమ్మన్ (జోర్డాన్): అండర్‌ెే17 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెజ్లర్ జస్పూరన్ సింగ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. పురుషుల 110 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో జస్పూరన్ కాంస్యం పోరుకు సిద్ధమయ్యాడు. తొలి రౌండ్‌లో ఓటమి పాలైనప్పటికీ జస్పూరన్ శనివారం జరిగిన రెపిచేజ్ రౌండ్‌లో జపాన్ రెజ్లర్ యుకి యమామొటోను రౌండ్ బై ఫాల్‌లో ఓడించాడు. ఇక కాంస్యం పోరులో జస్పూరన్ ఇరాన్ రెజ్లర్ మొహమ్మద్ నెజ్హద్‌ను ఎదుర్కోనున్నాడు. పురుషుల విభాగంలో జస్పూరన్ మినహా మిగతా రెజ్లర్లు క్వార్టర్స్‌కే ఇంటిబాట పట్టారు. మహిళల టీం విభాగం మాత్రం ఎనిమిది పతకాలు గెలవగా.. అందులో ఐదు స్వర్ణాలు ఉండడం విశేషం.




