12 May, 2026 | 8:49 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ఆ ఇంటర్యూ మాయని మచ్చ

25-08-2024 12:30 AM

న్యూఢిల్లీ: కాఫీ విత్ కరణ్ షో ఇంటర్యూ తన కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోయిందని టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. శనివారం నిఖిత్ కామత్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ ఇంటర్యూలో పాల్గొన్న రాహుల్ తన అనుభవాలను పంచుకున్నాడు.‘సాధారణంగా ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోను. కానీ కొన్నేళ్ల క్రితం నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. కాఫీ విత్ కరణ్ షో ఇంటర్వ్యూ వ్యక్తిగతంగా చాలా భయపెట్టింది.

ఆ వివాదం తర్వాత నా జీవితం మారిపోయింది. టీమిండియాకు ఆడడం మొదలుపెట్టాకా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 100 మందిలో ఉన్నా దైర్యంగా మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో జట్టు నుంచి సస్పెన్షన్‌కు గురయ్యా. తొలిసారి ఒక చేదు అనుభవం ఎదురైంది. నా జీవితంలో ఆ ఇంటర్యూ మాయని మచ్చగా మిగిలిపోయింది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.