24 August, 2026 | 10:17 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

హరితవర్ణం

16-06-2025 12:00 AM

లేచిగుళ్ళు, లేత గరికలు

గంతులెయ్యడం మానేసాయా

వర్షాలకి బదులు రక్తాలతో

నేలతల్లి తడిచిపోతుంటే!

పిట్టలూ పాటలూ పంటలూ

పడావు పడ్డాయా

మేఘాకాశాలకి బదులు

ఆయుధ పొగలు ఆకాశాన్ని కమ్మ్మేస్తుంటే!

గొడవలు

మేలిమి గుణాలకోసం పడాలి

మలిన రణాల కోసం కాకుండా!

మనుషుల అసువుల

అసలు సంగతి మతించాలి

గండపుండు మోక్షగతి మార్గానికి

విముక్తి దారిలో మసులుకోవాలి!

యుద్ధాలతో యోగులు కారు

యాగబలాలతో యోగులవుతారు!

మట్టి మనసు

సుగంధ పరిమళాలు 

వెదజల్లుతుంది

ముష్టి యుద్ధాల

రుధిర దుర్వాసనలని భరించదు!

తెల్లారితే కళ్ళు విప్పే పూలు

మన కళ్ళు అవ్వాలి!

పూల తేనెలుగా

మన కన్నీళ్లు మారాలి!

సతతం హరితాన్ని 

జీర్ణం చేసుకోవాలి!

 --ఒబ్బిని