24 August, 2026 | 11:24 PM

Breaking News

27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •   సేవోత్తమ్ శిక్షణలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు   •  

కవితోత్సవం!

16-06-2025 12:00 AM

మానవ వికాసంతో

ముడి వేసుకున్న 

లతాంతమే కవిత్వం!

ఎంత వైయిక్తికమైనా

అది సామూహికం కూడా

సామాజిక స్పృహ దాని జాడ!

అక్షరాలు ఏ తోటలో పూసినా

అంతర్ నిహితంగా

మాల కట్టేది కవిత్వమే!

మనం కలుసుకున్నట్లు

కవిత్వం ఒకచోట 

వెల్లి విరియడమే

కవితోత్సవం!

గాయ పడిన మనసుకు

కవిత్వమొక సాంత్వన

తెగిపడ్డ బొటన వేలుకు వెన్నుదన్ను!

అక్షరం పాటై పద్యమై పరిమళిస్తే

అది వాడక వాసన చెడక

చరిత్రకు దర్పణమై నిలుస్తుంది!!

 కోట్ల వెంకటేశ్వర రెడ్డి