3 August, 2026 | 5:35 PM

Breaking News

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •  

ఎల్లూర్ గ్రామంలో వీఓ భవన నిర్మాణానికి భూమి పూజ

12-02-2026 06:14 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): ఎల్లూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ నిధుల కింద మంజూరైన VO (విలేజ్ ఆర్గనైజేషన్) భవన నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చప్పిడే రవీందర్ ఆధ్వర్యంలో, MPDO ఆల్బట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రవీందర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

VO భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం గ్రామ మహిళా సంఘాలకు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దుర్గం నారాయణ, వార్డు సభ్యులు సునీత, దామోదర్, అశోక్, చప్పిడే సత్యనారాయణ, కుకిడే రాజేశ్వర్, బాపు, శోభన్, శ్రీకాంత్, సిరిపురం భీమయ్య, సదశివ్, పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య, హౌసింగ్ AE, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రేమనందం, SA దుర్గం తులసిరాం, గ్రామస్థులు పాల్గొన్నారు.