3 August, 2026 | 6:06 PM

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం

03-08-2026 05:32 PM

కొమురవెల్లి,(విజయ క్రాంతి): కొమురవెల్లి మండల కేంద్రంలోని గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న  సహాయ వంట మనిషి  పోస్ట్ భర్తీకి అర్హులైన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఎంఈఓ కోనేటి రవి తెలిపారు. అసిస్టెంట్ కుక్(వంట మనిషి) ఉద్యోగానికి ఏడవ తరగతి పాసై ఉండాలి. 25 సంవత్సరాల నుండి 55 వయసు కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులు. స్థానిక మహిళకు ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఆధార్ కార్డుతో పాటు ఏడవ తరగతి సర్టిఫికెట్  పాస్పోర్ట్  సైజ్ ఫోటోతో ఈనెల 6వ తేదీ లోపల కొమురవెల్లి కేజీబీవీ  పాఠశాలలో దరఖాస్తు చెసుకోవాలని తెలిపారు.