రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే జీఎంఆర్
జిన్నారం/అమీన్ పూర్, మే 27 : పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆద ర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం, లక్ష్మీపతిగూడెం, వావిలాల, గడ్డ పోతారం, అల్లి నగర్, కిస్టాయపల్లి, ఖాజీపల్లి, జిఎంఆర్ కాలనీలలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. హాజరైన మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






