28 May, 2026 | 1:37 AM

మహిళాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

28-05-2026 12:53 AM

ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

మహిళా సంఘం భవనాన్ని ప్రారంభిం ఎమ్మెల్యే 

నాగర్ కర్నూల్ మే 27 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని బుద్ధ సముద్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి సాధనలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గ్రామీణ మహిళలు సంఘాల ద్వారా స్వావలంబన సాధిస్తూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటున్నారని తెలిపారు.

మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. మహిళలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.