రైతులకు ఇబ్బంది కలిగితే సహించేది లేదు
కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
వైద్య సేవలో అలసత్వం వహిస్తే సహించేది లేదు
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
అచ్చంపేట, మే 27: ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది గురి చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ హెచ్చరించారు. బుధవారం బల్మూ రు మండల పర్యటనలో వివిధ పనులను పరిశీలించారు. కొండనాగులలో కొనసాగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. బల్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ప్రత్యక్షంగా పరిశీలించారు. కొండనాగుల రైతు వేదిక వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
కేంద్రం వద్ద రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యం విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువ చ్చారు. తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఆయా చోట నిర్వహించిన కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, తాహసిల్దార్ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






