8 March, 2026 | 3:34 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

మల్లన్న ఆలయ ఏఈఓగా వీధుల్లో చేరిన సుదర్శన్

06-02-2026 12:59 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారిగా ఆర్ సుదర్శన్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 2019 లో మల్లన్న ఆలయంలో ఏఈఓ గా విధులు నిర్వహిస్తూ, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి డిప్యూటేషన్ పై వెళ్లారు. దేవాదాయ శాఖ కమిషనర్ డిప్యూటేషన్ రద్దు చేస్తూ, తిరిగి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం రోజు సుదర్శన్ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనములు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాణా అధికారి టంకశాల వెంకటేష్, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, చిన్న మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ ఆలయ సిబ్బంది, మ శంకర్ శర్మ, మధుకర్, సిద్దయ్య, నర్సింలు తదితరులు ఉన్నారు.