30 March, 2026 | 2:21 AM

ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ

30-03-2026 12:42 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

కామారెడ్డి, మార్చి 29 (విజయక్రాంతి): చత్రపతి శివాజీ ఆశయాలను సాధిస్తూ, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లినప్పుడే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని టెక్రియాల్ 13వ వార్డులో జరిగిన ఛత్రపతి శివాజీ మాహారాజ్, బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ భూమి పూజ కార్యక్రమాల్లో  మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్,వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామీ అన్నారు.

స్థానిక కౌన్సిలర్ కొత్తపల్లి లలిత చిట్టిబాబు, కౌన్సిలర్లు కళ్ళే సావిత్రి సత్యం, మహేష్, సిద్ధిక్, వాజీద్, మాజీద్, భూపతి, మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి మల్లన్న, మాజీ కౌన్సిలర్ శంకర్ రావ్, రవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను సాధిస్తూ, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లినప్పుడే వారికీ మనమిచ్చే ఘనమైన నివాళులు అని తెలిపారు.