30 March, 2026 | 2:19 AM

జవహర్ నవోదయలో సీటు సాధించిన విద్యార్థికి సన్మానం

30-03-2026 12:39 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 29 (విజయక్రాంతి): జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో నాగిరెడ్డిపేట్ మండలం మెల్లకుండా తాండ గ్రామానికి చెందిన కోర్ర వజ్ర నాయక్ మనుమడు కోర్ర నిఖిల్ ఇటీవల అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...రానున్న రోజుల్లో ఇదే మాదిరిగా ఉన్నతంగా రాణించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థికి సూచించారు.ప్రాంతీయ ప్రాంతాల నుండి మంచి చదువును అభ్యసించి ఎక్కువమంది ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని తెలిపారు.మరింత మంచి ఉన్నత స్థానానికి ఎదిగి భవిష్యత్తులో స్థిరపడి మండలానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వజ్ర నాయక్, గోవింద నాయక్,శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.